ఇఫ్తార్ విందులో పాల్గొన్న సింగరేణి ఏరియా GM
MNCL: రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, సోదరభావానికి నిదర్శనమని మందమర్రి ఏరియా GM రాధాకృష్ణ అన్నారు. సోమవారం రాత్రి ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగ జరుపుకోవడం మతసామరస్యానికి చిహ్నమని కొనియాడారు. ముస్లింలు లోక కల్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు.