రెండేళ్లుగా నిలిచిన ప్రహరీ నిర్మాణం

రెండేళ్లుగా నిలిచిన ప్రహరీ నిర్మాణం

ASR: కించుమండ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రహరీ గోడ పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. రెండేళ్ల క్రితం ప్రారంభించిన నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో పాఠశాల పూర్తిస్థాయి రక్షణ లేకుండా ఉంది. దీంతో బయట వ్యక్తులు, మూగజీవాలు లోపలకు వస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.