'అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి'

SKLM: అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. గార ప్రాజెక్టు మహాసభ బుధవారం గారలో జరిగింది. 2023 డిసెంబర్, 2024 జనవరిలో చేసిన 42 రోజులు సమ్మె పోరాటం చారిత్రాత్మకమైనదని అన్నారు. ఈ సమ్మె సందర్భంగా 2024 జూలైలో వేతనాలు పెంచుతామని చెప్పినా నేటికీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు.