రఘునాథపల్లిలో చోరీ నగదు, సిగరెట్లు అపహరణ

రఘునాథపల్లిలో చోరీ నగదు, సిగరెట్లు అపహరణ

జనగాం: రఘునాథపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు దుకాణంపై దాడి చేశారు. రైల్వే గేట్ సమీపంలో భువన వైన్స్ పక్కన ఉన్న ఇమ్మడిశెట్టి మల్లేష్ పాన్ షాప్ మిర్చి బండి దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం నుంచి రూ.1,100 నగదు, సుమారు రూ.5,000 విలువైన సిగరెట్ ప్యాకెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.