గణేశ్ మండపం వద్ద ముస్లిం అన్నదానం

ADB: ఇచ్చోడలోని హనుమాన్ గణేశ్ మండలి వద్ద అనీష్ బేగ్ అనే ముస్లిం యువకుడు మంగళవారం అన్నదానం నిర్వహించి మతసామరస్యాన్ని చాటాడు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరం అన్నదమ్ముళ్ల వలే కలిసిమెలిసి ఉండాలని చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో గణేశ్ మండప ప్రెసిడెంట్ బొజ్జ రాజేందర్, రాజకుమార్, రాజేశ్వర్. మహేష్ కుమార్, లక్ష్మణ్, శేఖర్, ఈశ్వర్ తదితరులున్నారు.