CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
BPT: వేమూరు నియోజకవర్గంలో 11 మంది ముఖ్యమంత్రి సహాయ నిధికి మంజూరు చేసుకున్న నేపథ్యంలో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే ఆనందబాబు లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం మీద రూ. 3,03,037ల సహాయ నిధిని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి బాసటగా నిలుస్తుందన్నారు.