'లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకు పోరాడతాం'
BDK: ఇల్లందు భగత్ సింగ్ సెంటర్‌లో IFTU ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు కొక్కు సారంగపాణి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ స్ఫూర్తితో కార్మిక వర్గం కోడ్‌లను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.