ఉస్మానియా యూనివర్సిటికి 107 ఏళ్ల ఘన చరిత్ర!

HYD: ఈరోజుతో ఉస్మానియా యూనివర్సిటీ 107 సంవత్సరాలు పూర్తి చేసుకొని 108వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. మొదట 1917 ఏప్రిల్ 26న ఇంటర్ మీడియట్ తరగతులతో వర్సిటీ ప్రారంభమైంది. ఆ తరువాత డిగ్రీ, పీజీ కోర్సులను ప్రారంభించి దేశంలోనే ఉత్తమ విద్యా సంస్థగా గుర్తింపు పొందింది. దేశంలోని అతి ప్రాచీన వర్సిటీల్లో ఉస్మానియాది ఏడవ స్థానం కాగా దక్షిణ భారతదేశంలో మూడవది.