క్రీడలతోనే మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యం: డీటీ
JN: క్రీడలతోనే మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యమని కొడకండ్ల మండల డిప్యూటీ తహసీల్దార్ పద్మజ అన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ లెవెల్ క్రీడలను శుక్రవారం కొడకండ్లలో ప్రారంభించారు. అనంతరం డీటీ మాట్లాడుతూ.. యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని నిత్య జీవితంలో క్రీడలను భాగంగా చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.