పోగొట్టుకున్న మొబైల్ రికవరీ చేసిన పోలీసులు

పోగొట్టుకున్న మొబైల్ రికవరీ చేసిన పోలీసులు

GDWL: మానోపాడు మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనరసింహ పోగొట్టుకున్న మొబైల్‌ను ఉండవెల్లి పోలీసులు సాంకేతిక సహాయంతో గుర్తించి తిరిగి అందజేశారు. ఇటీవల ఆయన ఫోన్ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇన్‌ఛార్జ్ ఎస్సై శేఖర్ బృందం CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను ట్రేస్ చేసి రికవరీ చేసింది. బుధవారం పోలీస్ స్టేషన్‌లో బాధితుడికి మొబైల్‌ను అప్పగించారు.