పేకాట స్థావరంపై పోలీసుల దాడి
MDK: చేగుంట బోనాల శివారులో పేకాట ఆడుతున్న శిబిరంపై దాడులు చేసినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 57,830 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.