భూగర్భ జలాల స్థాయిని పెంచేలా కృషి: కలెక్టర్

భూగర్భ జలాల స్థాయిని పెంచేలా కృషి: కలెక్టర్

ELR: ఏలూరు జిల్లాలో నీటి నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలిపారు. నీటి నిర్వహణ, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ వంటి అంశాలపై గురువారం సీఎం రాష్ట్రంలోని కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ సీఎంకు వివరించారు.