చౌడూరులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం
KDP: ప్రొద్దుటూరు మండలం చౌడూరులో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు మండల వ్యవసాయ శాఖ అధికారి వరహరికుమార్, VAOలు చౌడూరు గ్రామంలో పొలాలను పరిశీలించారు. రైతులు సాగుచేసిన పంటల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలకు జరిగిన నష్టాలను వారు పరిశీలించారు.