రేషన్ కార్డ్‌లు పంపిణీ చేసిన MLC, కలెక్టర్

ASF: కౌటాల మండలంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందన్నారు. నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.