'భక్తులకు మెరుగైన సేవల కల్పనే లక్ష్యం'

'భక్తులకు మెరుగైన సేవల కల్పనే లక్ష్యం'

కృష్ణ: భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యమని దుర్గగుడి ఈవో శీనానాయక్ అన్నారు. మల్లికార్జున మహామండపంలో నిర్వహించిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్న ప్రసాదం, ఉచిత ప్రసాదాల పంపిణీ, తాగునీరు, పారిశుధ్ద్యం, మరుగుదొడ్లు వంటి  మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.