VIDEO: ఘనంగా మరియ మాత పండుగ

కృష్ణా: ఏసుప్రభువు తల్లిగా మరియమాత ఎన్నో కష్టాలు అనుభవించిందని ఫాదర్ బెర్నర్డ్ అన్నారు. సోమవారం పెదపారపూడి మండలం వెంట్రప్రగడలో గ్రామంలో మరిమాత జన్మదినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి చర్చిలో ఫాదర్ బెర్నర్డ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మరియ మాత విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం కేక్ కట్ చేశారు.