నేను ఇక్కడికి వస్తే కింగ్‌లా ఫీలవుతా: ఉపేంద్ర
HYDలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ సక్సెస్ మీట్‌ను ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ.. 'స్క్రిప్ట్ విన్నప్పుడు థ్రిల్ అయ్యా. మీరు ఆంధ్ర కింగ్‌గా కనిపిస్తారని మేకర్స్ చెప్పగానే టెన్షన్ పడ్డా. నేనెప్పుడూ ఇక్కడికి వచ్చినా కింగ్‌లా ఫీలవుతా. మీరు నాపై చూపే ప్రేమ, అభిమానమే అందుకు కారణం. 25ఏళ్లుగా అదే అనుభూతి పొందుతున్నా' అని అన్నాడు.