మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని మరపకుంట్ల గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై కృష్ణ పావని బాలుడి ఆచూకీని 2 గంటల్లో ఛేదించారు. సిబ్బంది విస్తృతంగా గాలించి 2 గంటల్లో నాగిరెడ్డిపల్లె పొలాల్లో దాక్కున్న బాలుడిని గుర్తించి తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.