ఉజ్వల యోజన 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
EG: అనపర్తి రజక కమ్యూనిటీ హాల్లో సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉజ్వల యోజన 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కట్టెల పొయ్యితో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మహిళలను కాపాడేందుకు ఈ పథకానికి మోదీ శ్రీకారం చుట్టారన్నారు.