రైతులు విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే

కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు మొదటి విడతగా రూ.7 వేలు చొప్పున నిధులు జమ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయడంతో, స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం 100 ట్రాక్టర్లతో ఎమ్మెల్యే కార్యాలయం నుండి అంబాజీపేట మార్కెట్ యార్డు వరకు విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.