'రిమ్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'
ఆదిలాబాద్ రిమ్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని కోరుతూ మంగళవారం ఇన్ పేషెంట్ బ్లాక్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతతో పాటు వారిపై పని భారం తగ్గించాలన్నారు.