'ప్రభుత్వ కేంద్రాల్లోనే మొక్కజొన్న అమ్మండి'
SDPT: మిరుదొడ్డిలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం పీఎసీఎస్ ఛైర్మన్ లింగాల రాజలింగా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులకు కాకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో క్వింటాకు రూ. 2400 మద్ధతు ధరకు తమ పంటను అమ్మలని సూచించారు.