విద్యార్థులకు బహుమతులు అందజేత

విద్యార్థులకు బహుమతులు అందజేత

NZB :మోస్రా మండల కేంద్రంలో హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, అదే విధంగా ఉత్తమ అటెండెన్స్ కలిగిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుత్పే భూపాల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.