ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి
MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని స్థానిక ఎంపీఓ జలంధర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 29 గ్రామపంచాయతీలు ఉన్నాయన్నారు. ఆయా మండలాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని అన్నారు. రెండు రోజులుగా వారు సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారని వెల్లడించారు.