ఈదురుగాలుల బీభత్సం.. కూలిన ఇల్లు

ఈదురుగాలుల బీభత్సం.. కూలిన ఇల్లు

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని లింగాలలో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఈదురుగాలులు వీచాయి. గాలులకు గ్రామానికి చెందిన జంపాల అంజన్న ఇంటి ముందున్న రేకుల టేల గాల్లో ఎగిరొచ్చి అతని ఇంటి పైకి ఎక్కింది. దీంతో ఇల్లు, రేకుల షెడ్డు నాశనమయ్యాయని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు.