పాఠశాలకు సీసీ కెమెరాలు వితరణ
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర ఇస్లాంపూర్ యాకయ్య-కొమురమ్మ దంపతులు నాలుగు సీసీ కెమెరాలను ఇవాళ సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి చేతుల మీదుగా గ్రామంలోని ZPHS పాఠశాలకు అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వలన ప్రభుత్వ పాఠశాలకు రక్షణ ఉంటుందన్నారు.