భారత్‌తో ఘర్షణ జరగవచ్చు: పాక్ మంత్రి

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసీఫ్ ప్రకటన చేశారు. భారత వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీన్ని కొట్టిపారేయలేమని అన్నారు. ఇప్పటికే తమ గగనతలంలోకి రావడానికి ప్రయత్నించిన రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్లు తెలిపారు. సింధు నదిపై భారత్ నిర్మించే కట్టడాన్ని దాడి చేసి అయినా కూల్చేస్తామని అన్నారు. కాగా, ఇటీవల భారత్ తమపై 36 గంటల్లో దాడి చేస్తుందని ఖవాజ చెప్పారు.