కాళీపట్నంలో పోలీసుల పల్లె నిద్ర

W.G: మొగల్తూరు మండలం కాళీపట్నం వెస్ట్ పంచాయతీలో పోలీసులు బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. నర్సాపురం రూరల్ సీఐ దుర్గ ప్రసాద్, మొగల్తూరు ఎస్సై జి.వాసు ప్రజలతో సమావేశమై మాట్లాడారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు అందరూ సహకరించాలని ప్రజలకు సూచించారు. గ్రామ ప్రజలంతా శాంతియుతంగా మెలగాలని అన్నారు. అనంతరం చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.