'వెబ్‌సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చు'

KRNL: నగరంలో ఈనెల 5వ తేదీ సోమవారం ఉదయం ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, మండల మున్సిపల్, డివిజన్ స్థాయిలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్జీల స్థితి తెలుసుకోడానికి 1,100 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీల నమోదు చేసుకోవచ్చునని అన్నారు.