నడింపల్లిలో ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు

నడింపల్లిలో ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు

CTR: సోమల మండలంలోని SKVN ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆదివారం నడింపల్లిలో సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని రహదారికి ఇరువైపులా, పాఠశాల ఆవరణం, చుట్టుపక్కల ప్రదేశాలలో పిచ్చి మొక్కలను తొలగించి, శుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అమరేంద్ర కుమార్, సర్పంచ్ రమణ, జీఎల్ గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.