రుణం ఇప్పించి జీవనోపాధి కల్పించండి

ప్రకాశం: ఈనెల 2న కనిగిరి మండలం కలగట్లలో పిడుగుపాటుకు 20 మేకలు మృతి చెందిన విషయం విధితమే కాగా బాధితురాలు నూకతోటి శివ పార్వతి బుధవారం తహసీల్దార్ రవిశంకర్‌ను కలిశారు. 50 శాతం సబ్సిడీతో 5 లక్షల రుణం అందించి ఆదుకోవాలని కోరారు. రుణం అందిస్తే తిరిగి మేకలు కొనుక్కుని జీవనం సాగించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.