బస్సులు ఆపాలని ఎమ్మెల్యే కి వినతి
BHNG: బస్ స్టాప్‌లో అన్ని బస్‌లు ఆపాలని గూడూరు ప్రజాప్రతినిధులు అందరు కలిసి భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ రోజు ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్, ఉపసర్పంచ్ సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.