అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ప్రకాశం: వెలిగండ్ల మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద మంగళవారం సీఐటీయూ, అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా సీఐటీయూ కార్యదర్శి రాయల మాలకొండయ్య మాట్లాడుతూ.. 2019 నుంచి వేతనాలు పెరగలేదని, ప్రభుత్వ హామీలు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.