ఈనెల 22 నుంచి D.ED వార్షిక పరీక్షలు

ASF: జిల్లాలో ఈనెల 22 నుంచి 27 వరకు D.ED సెకండియర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్ టికెట్‌లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.