బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం
SKLM: నరసన్నపేట మండలం మడపం గ్రామానికి చెందిన రుప్ప సీతారం ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు ఇవాళ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు పరామర్శించారు.