రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
VZM: మండల కేంద్రమైన బొండపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మక్కువ మండలం వెంకటభైరపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్ పై విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తుండగా బొలెరో వాహనాన్ని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.