జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 96.24% హాజరు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్ష ముగిసింది. మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో 10,046 మంది విద్యార్థులకు 9,668 మంది హాజరయ్యారు. 378 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా జిల్లాలో సగటు హాజరు శాతం 96.24గా నమోదైందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా, మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు