VIDEO: కౌకుంట్ల-ఇస్రంపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం
MBNR: కౌకుంట్ల మండలంలో ఇటీవల కురిసిన వర్షాలు, పైప్రాంతాల నుంచి వచ్చిన వరదనీటి ప్రభావంతో కౌకుంట్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో భారీగా నీరు చేరడంతో కౌకుంట్ల-ఇస్రంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.