పెందుర్తి–సింహాచలం సెక్షన్‌లో డీఆర్‌ఎం పర్యవేక్షణ

VSP: విశాఖలోని వాల్తేరు డివిజన్, రైలు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పెందుర్తి–సింహాచలం సెక్షన్‌లో రాత్రివేళల్లో భద్రతా పనులను చేపట్టింది. ఈ పనుల పురోగతిని డీఆర్‌ఎం లలిత్ బోహ్రా శనివారం పర్యవేక్షించారు. బల్లాస్ట్ క్లీనింగ్ మెషిన్ పనితీరును పరిశీలించారు. ఆయన రాకతో రాత్రిపూట పనిచేస్తున్న సిబ్బందిలో ఉత్సాహం పెరిగింది.