రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
MHBD: మరిపెడ మండలం బురహన్ పురం శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామంలో గల పత్తి మిల్లు దగ్గర ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తానంచర్ల రెడ్యా తండాకు చెందిన గుగులోత్ సైదులు, బురహన్ పురం ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.