అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్సీ
ASR: పాడేరులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను సోమవారం ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో సామాన్య ప్రజలకు అందుతున్న భోజన సౌకర్యాలను, నాణ్యతను, అక్కడ నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను ఆమె స్వయంగా రుచి చూశారు. భోజన నాణ్యతలో ఎటువంటి రాజీ పడవద్దని క్యాంటీన్ సిబ్బందిని ఆదేశించారు.