శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో బుధవారం సాయంత్రం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తికా దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం గర్భాలయంలో, ఆ తర్వాత శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపై దీపారాధన చేశారు. ఊంజల్ మండపంలో శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించి, జ్వోలాతోరణం వెలిగించారు.