నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ సమీక్షించనున్నట్లు ఆదివారం వివరించారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు.