బిక్నూరులో ఎడ్లబండ్ల ప్రదర్శన

బిక్నూరులో ఎడ్లబండ్ల ప్రదర్శన

కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్ శివారులోని సిద్ధిరామేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం రాత్రి వివిధ కుల సంఘాల సభ్యులు అందంగా అలంకరించిన ఎడ్లబండ్లను పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. ఆలయం చుట్టూ తిప్పి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి మహం తప్ప ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.