పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన కలెక్టర్

పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన కలెక్టర్

ATP: అమరజీవి పొట్టి శ్రీరాములు భాష ప్రయుక్త రాష్ట్రాలకు ఆధ్యులని అమరజీవి వారి సేవలు చిరస్మరణీయం భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనం నందు ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.