సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే
NDL: ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇవాళ సంబంధిత అధికారులతో కలిసి NH హైవేను పరిశీలించారు. తాజాగా టిడ్కో గృహాల వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందిన నేపథ్యంలో, అక్కడ ఒక్క రూట్ మాత్రమే ఉండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.వెంటనే ఈ సమస్య పరిష్కారానికి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.