ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

KMM: వైరా మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో శ్రీ కోటమైసమ్మ దేవాలయం బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు ప్రారంభం కానున్నాయని ఆలయ ఛైర్మన్ పర్సా పట్టాభి రామారావు, ఈఓ కె. వేణుగోపాలాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.