'ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
HNK: వేయి స్తంభాల దేవాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.14.14 కోట్లతో డ్రైనేజీ, లైటింగ్, గార్డెన్, కోనేరు పనులు చేపడతామని MLA చెప్పారు. ఆలయ సుందరీకరణకు రూ.30 కోట్లు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. గతంలో బీజేపీ, BRS నేతలు నిధులు తేలేదని విమర్శించారు.