కురవిలో చైన్ స్నాచింగ్ కలకలం
MHBD: కురవి మండల కేంద్రంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ శ్రీనివాస్ గల్లీలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. కురవి దేవాలయ ధర్మకర్త చిన్నం గణేష్ భార్య సరస్వతి మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు పుస్తేలతాడును గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి లాక్కెళ్లారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.