గోదావరి పుష్కరాలపై అధికారుల సమీక్ష
AP: గోదావరి పుష్కరాలపై మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి పుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. శానిటేషన్, హెల్త్, మున్సిపల్ వర్క్స్ సహా పలు ఇతర అంశాలపై సమీక్షించనున్నారు. పుష్కరాలకు సంబంధించి నేడు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అధికారులతో ప్రిలిమినరీ మీటింగ్ జరగనుంది.